Saturday, January 22, 2011

Hey Jaganmohana!


హే జగన్మోహన !
పుట్టిన వాడికి మరణం తప్పదు,
మెజారిటి లేని ప్రభుత్వాలు కూలిపోక తప్పదు!
నీవు కూల్చక పోయినా
కుయ్...కుయ్...మంటూ, కర్మ ఫలానికి కూలిపోక తప్పదు!!

హే జగన్మోహన !
ప్రభుత్వాన్ని కూల్చటానికి సందేహమేలా?
నీ తండ్రి స్థాపించినదని సెంటిమెంటా? లేక జెంటిల్ మేనిజమా?
నీ తండ్రే లేనపుడు, నీ తండ్రి ఊసే లేనపుడు,
నీ తండ్రిని అనుమానిస్తూ, అవమానిస్తున్న
ఈ ప్రభుత్వాలకు పాలించే అర్హత ఎక్కడిది?
వారిని కొనసాగించడము ఏలా జెంటిల్ మేనిజము అవుతుంది?

లే... జగన్మోహన! లే... లేచి పోరాడు.
నీ లక్ష్య దీక్షలో న్యాయం ఉంది
నీ జల దీక్షలో ధర్మం ఉంది
నీ జన దీక్షలో దైవం ఉంది

లే .... జగన్మోహన! .. లేచి పోరాడు!
అధర్మం, అన్యాయం, అవినీతిమయమైన ప్రభుత్వాలతో
ప్రజలు విసుగెత్తి, జీవచ్చవాల్లా బ్రతుకుతున్నారు.
ఆ ప్రభుత్వాలను కూల్చటము అధర్మము కాబోదు!

లే .... ఆ ప్రభుత్వాలను కూల్చేయ్! అన్యాయాలను కడిగెయ్!
ధర్మ సంస్థాపన చేసెయ్!

ఓదార్పులు చాలు! ఓట్ల పండుగలు రావలిప్పుడు!
అధర్మ నాయకులను రాజకీయంగా బొంద పెట్టాలిప్పుడు!

లే .... లేచి పోరాడు....
తెలంగాణ రాష్ట్ర సిద్ధికి మార్గం సుగమం చెయ్
సీమాంధ్ర స్వరాష్ట్ర అభ్యున్నతికి దారులు
వెయ్

జై తెలంగాణ ... జై జై తెలంగాణ
జై సీమాంధ్ర ... జై జై సీమాంధ్ర
సర్వే జన సుఖినోభవంతు.

(వ్యంగ్య కవిత - అందరికి సమజైన్దనుకుంట!!!)

0 comments:

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP