Monday, March 14, 2011

అంతా మీరే చేశారు !!!

అంతా మీరే చేశారు !!!! ....అని, ఎవరైనా సీమాంద్రుడు (తెలంగాణ వ్యతిరేకి) కనిపిస్తే కడిగేయాలని ఉంది.
ఒక సాదారణ పౌరుడిగా, జరుగుతున్న సంఘటనలను పరిశీలిస్తే, తెలంగాణ ప్రాంతియులుగా మేము ఉద్యమిస్తున్న, ఉద్యమానికి ఉరిగోల్పిన సందర్భాలకు, సమస్యలకు మూలకారకులు ముమ్మాటికి సీమాంద్రులే.

యాభై ఏళ్ల చరిత్ర వదిలేద్దాం, అగ్రిమెంట్లు, ఒప్పందాలు, జీవోలు మరిచిపోదాం, గత పదేళ్ళ నుంచి మీరు చేస్తున్న చారిత్రిక తప్పిదాలను, అవకాశవాదాన్ని నేమరేసుకుందాం.

2001 - తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం :
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఒక పార్టీ మొదలైతే, దానిని విమర్శించటం మినహా, తెలంగాణ ప్రజల సంక్షేమానికి, ప్రజలలో రాష్ట్ర కాంక్ష రాకుండా చేపట్టిన చర్యలేవి? మీ సమైక్యవాదాన్ని అపుడు ఎందుకు తేలేదు?

2004 - ఎన్నికలు, టిఆరెస్-కాంగ్రెస్ దోస్తీ - గెలిస్తే తెలంగాణ ఏర్పాటు చేస్తామని వాగ్ధానం
సీమాంధ్ర నాయకుల, ప్రజల అతి పెద్ద పొరపాటు, దోస్తీని అంగీకరించటం, కూటమికి ఓట్లేసి గెలిపించటం. ప్రత్యేక రాష్ట్రం కోసం ఏర్పాటైన పార్టీతో పొత్తును ఎలా అంగీకరించి ఓట్లేసి గెలిపించారు? మీ సమైక్యవాదం అపుడు గుర్తు రాలేదా?

2009 - ఎన్నికలు, టిఆరెస్-టిడిపి పొత్తు
సీమాంధ్ర నాయకులు, ప్రజలు చేసిన మరో పొరపాటు పొత్తును కుడా అంగీకరీంచటం, ఓట్లేయటం. ప్రత్యేక రాష్ట్రం కోసం ఏర్పాటైన పార్టీతో పొత్తు ఎందుకని ఈసారి కూడా ప్రశ్నించిన వారు లేరు. వారికి సమైక్యవాదం అపుడు కుడా గుర్తు రాలేదు.

ఇటువైపు తెలంగాణ ప్రజలు జరుగుతున్న, పొత్తులను, కొత్త కొత్త దోస్తులను గమనిస్తూ, సీమాంధ్ర నాయకుల, ప్రజల వైపు నుంచి ఎటువంటి వ్యతిరేకత రాకపోవడాన్ని తెలంగాణ రాష్ట్రనికి వారి సమ్మతి గానే భావించారు. కొంచెం ఆలస్యమైనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తధ్యమని భావించారు. గత రెండు ఎన్నికలను పరిశీలిస్తే, తెలంగాణలో ప్రతి పార్టీ ప్రత్యేక రాష్ట్ర నినాదంతోనే బరిలోకి దిగింది. తెలంగాణ ప్రజలు పార్టీ కి ఓటు వేసిన ప్రత్యేక రాష్ట్ర కాంక్షతోనే ఓటు వేశారు. కానీ, మా ఓట్లతో ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకొని, మా కాంక్షలను మరిచి, వాగ్దానాలను మరచి నిస్సిగుగా వ్యవహరిస్తున్న వాళ్లకి బుద్ది చెప్పాలని నిర్ణయించుకొన్నారు.

వైయస్సార్ మరణం, తెలంగాణ ఉద్యమానికి మరో దారిని చూపింది, కెసిఆర్ నిరాహారదీక్షతో అది ఉవ్వెత్తున్న ఎగసిపడినది. కెసిఆర్ మరణశయ్యపై ఉన్న వేళ, రాష్ట్ర ముఖ్యమంత్రితో జరిగిన అఖిలపక్ష సమావేశంలో మీ నాయకులు బేషరతుగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి ఒప్పుకున్నా క్షణం కుడా, మీకు, మీనాయకులకు సమైక్యవాదం గుర్తుకు రాకపోవడం హాస్యాస్పదం.

2009 డిసెంబర్ తొమ్మిది రాత్రి వరకు, తెలంగాణ ప్రజలు భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై పెట్టుకున్న అచంచల నమ్మకము వమ్ము కాలేదు. అన్ని పార్టీల అంగీకారంతోనే, మీరు ఓట్లేసిన నాయకుల సమక్షంలోనే, గత ఎన్నికలలో మీరు ఇచ్చిన మద్దతుతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చింది.

తెల్లారేసరికి, మీ నాయకులు ఆడిన రాజకీయ డ్రామాలు, మీకు కొత్తగా గుర్తొచ్చిన సమైక్యవాదం, మీ పచ్చి అవకాశవాదానికి, అహంకారానికి గుర్తులుగా తెలంగాణ ప్రజల మనస్సులో చిరస్థాయిగా నాటుకోపోయాయి. మా పట్ల మీకు ఎంతటి అభిమానాముందోతెలిసివచ్చింది, ఆరోపణలుగా ఉన్న మీ నిర్లజ్జ, దోపిడిదారి వ్యక్తిత్వం నిజమేనని తేలిపోయింది.

ఇంకా మనం కలిసి ఉంటామనుకోవటం పగటి కలే అవుతుంది. మీ నిజ స్వరూపాలు బట్టబయలు అయినాక తెలంగాణ ప్రజలెవరు మీతో కలిసి ఉండడానికి సిద్దంగా లేరు. పోరాడి అయిన తెలంగాణ రాష్ట్రాన్ని సాదించుకోవటానికి ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. మీలో కాసింత మానవత్వం మిగిలిఉన్న జై తెలంగాణ - జై సీమాంధ్ర అనండి, అందులోనే అందరి క్షేమం ఉంది.

అందుకే మళ్లీ మళ్లీ అంటాను - అంతా మీరే చేశారు.......!!!!!!

0 comments:

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP